టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Budda Venkanna)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలినాని (K0dali Nani), డీజీపీ గౌతమ్ సవాంగ్ (Goutam Sawang) లపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఈ రోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన బుద్ధా వెంకన్న గుడివాడ క్యాసినో వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యలో క్యాసినో నిర్వహించారని, అందులో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వాటా ఉందని , అందుకే కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
అదేవిధంగా చంద్రబాబు ఇంటిగేటు తాకితే కొడాలి నాని శవాన్ని ఇంటికి పంపిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు ఉదయమే బుద్ధా ఇంటికి వెళ్లారు పోలీసులు. కాగా అరెస్ట్ సమయంలోనూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు బుద్ధా వెంకన్న. తాను మాట్లాడిన మాటలు పచ్చి నిజాలంటూ.. డీజీపీ జగన్ కు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాగా ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలియగానే పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..
Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..