
రాజకీయాల కోసం మహిళా కమిషన్ ను వాడుకుంటున్నారని టీడీపీ లోడర్ బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం కమిషన్ ఛైర్ పర్సమ్ వాసిరెడ్డి పద్మపై కాదన్న ఆయన.. ప్రభుత్వం పై చేస్తున్న పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. వైసీపీ నేతల నేరాలు చేస్తుంటే మూడేళ్లుగా సీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. తమకు నోటీసులిచ్చే అధికారం కమిషన్ కు లేదన్నారు. తాము విచారణకు హాజరవడం లేదని.. మహిళ కమిషన్ నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో మూడేళ్లలో మహిళపై 800 నేరాలు జరిగాయన్న బోండా ఉమ.. పబ్లిసిటీ కోసం మహిళ కమిషన్ నోటీసులిచ్చి వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ కమిషన్ పై నేషనల్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కోర్టులో రిట్ పిటిషన్ వేసి సీబీఐ దర్యాప్తు కొరతామని.. తమను జైల్లో పెట్టినా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని వెల్లడించారు.
విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమా కు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. అత్యాచారం ఘటనను రాజకీయం చేయడమే కాకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. మహిళా లోకానికి క్షమాపణ, సంజాయిషీ ఇప్పించేందుకే కమిషన్ వద్దకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న కమిషన్ ముందు చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందేనని… లేనిపక్షంలో మహిళా కమిషన్ అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
PM Narendra Modi: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..
CM KCR Speech: టీఆర్ఎస్‌కు వెయ్యి కోట్ల ఆస్తులు.. తెలంగాణ కాపలాదారు పార్టీ..
TRS Foundation Day: జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. సమావేశంలో ప్రవేశ పెట్టనున్న తీర్మానాలు ఇవే..