Chandrababu Naidu: తాడేపల్లి అత్యాచారం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ..

|

Jun 21, 2021 | 6:35 PM

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సీతానగరం పుష్కరఘాట్...

Chandrababu Naidu: తాడేపల్లి అత్యాచారం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ..
Chandrababu
Follow us on

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై నిలదీస్తూ లేఖ రాశారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశం సీఎం నివాసానికి దగ్గర లోనే ఉందని, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా మూడు కిలోమీటర్లు దూరంలో ఉందని పేర్కొన్న ఆయన.. ఈ ఘటనను పరిశీలిస్తూ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలో అసలు దిశ యాక్ట్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని డీజీపీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల కు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పెట్రోలింగ్, గట్టి నిఘా లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. కృష్ణా నది ఒడ్డున, పుష్కర ఘాట్‌ల వద్ద గంజాయి, మద్యం సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చంద్రబాబు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం అవకుండా మహిళలకు రక్షణ కల్పించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. వారిలో ఒకరిని గుర్తించి ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Also read:

Bonalu: ఈ ఏడాది ఘనంగా బోనాల జాతార.. జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు