విశాఖలో టీడీపీ – జనసేన – సీపీఐల సరికొత్త రాజకీయ కలయిక

జనసేన నేత కూన తాతారావు, శివ శంకర్‌లు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ దారుణమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోందని అన్నారు. ఈ అరాచక జగన్‌కి చరమ గీతం పాడాలని..  భవిష్యత్‌లో జిల్లాస్థాయిలో ప్రజా ఇబ్బందులు మీద పొరాటాలు చేస్తామన్నారు. విశాఖను పీడిస్తున్న మూడు భూతాలు మీద పోరాటం చేస్తామన్నారు

విశాఖలో  టీడీపీ - జనసేన - సీపీఐల సరికొత్త రాజకీయ కలయిక
Vizag Leaders
Follow us
Eswar Chennupalli

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 11, 2023 | 9:03 PM

విశాఖలో ఈరోజు సరికొత్త రాజకీయ సమీకరణం వెలుగు చూసింది. ఇప్పటివరకు టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచార నేపధ్యానికి భిన్నమైన సమావేశం జరిగింది. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ – జనసేనలతో కలిపి సీపీఐలు కలిసి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. జగన్ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేయాలని, ప్రజా సమస్యలపై మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీకి ఆహ్వానం లేకపోవడం, మరోవైపు వైరుధ్య పార్టీ సీపీఐ హాజరు కావడంతో.. ఇక బీజేపీతో పొత్తు లేనట్టేనా ఆన్న డిస్కషన్ జరుగుతోంది. ఓ వైపు పవన్ కళ్యాణ్ అభిష్టమైన టీడీపీ – జన సేన – బీజేపీల పొత్తుకు భిన్నంగా జరిగిన సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటమన్న టీడీపీ

వైసీపీ అరాచక పాలనపై సమిష్టిగా పోరాడుతాం అంటూ సరికొత్త రాజకీయ కూటమి టీడీపీ – జన సేన – సీపీఐ పార్టీల అఖిలపక్ష నేతలు కదం తొక్కారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు ఆరాచకాలు, అక్రమ అరెస్టులు తప్ప అభివృద్ధి ఎక్కడ కానరావడం లేదని మండిపడ్డారు నేతలు. వైసీపీ అరాచక పాలనపై సమిష్టిగా పోరాడుతామని ఉద్ఘాటించారు.

టీడీపీ మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావులు మాట్లాడుతూ జనసేన, టీడీపీ, సీపీఐ నేతలు అంతా కలసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామనీ, చంద్రబాబు అరెస్ట్‌కు సంఘీభావం ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ విమానం ఎక్కితే ఆ విమానం విజయవాడలో దిగడానికి వీలు లేదని ఆపేశారని అన్నారు.  విశాఖలో కొందరు మహిళలు నిరసన చెయ్యడానికి సిద్ధం ఐతే, పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని చెప్పారు. ప్రజా వ్యతిరేక అంశాలు మీద టీడీపీ, జనసేన, సీపీఐలు కలిసి పని చేస్తాయని వెల్లడించారు. జనసేన సీపీఐలు కలసి పని చేస్తాయని అన్నారు.  ఎప్పుడెప్పుడు జగన్‌కి బై బై చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, 99శాతం హామీలు అమలు చేశామని చెప్తున్న పెద్దలు మరి మద్యపాన నిషేధం అమలు చేశారని అన్నారు

వైసీపీని గద్దె దించడమే లక్ష్యం అన్న జనసేన

జనసేన నేత కూన తాతారావు, శివ శంకర్‌లు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ దారుణమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోందని అన్నారు. ఈ అరాచక జగన్‌కి చరమ గీతం పాడాలని..  భవిష్యత్‌లో జిల్లాస్థాయిలో ప్రజా ఇబ్బందులు మీద పొరాటాలు చేస్తామన్నారు. విశాఖను పీడిస్తున్న మూడు భూతాలు మీద పోరాటం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పైడి రాజు మాట్లాడుతూ ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖలో భూములు ఆక్రమించారని..  అటువంటి వ్యక్తిని మంత్రిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు మొత్తానికి సమావేశానికి బీజేపీకు ఆహ్వానం లేకపోవడం, భిన్నంగా సీపీఐ హాజరు కావడంతో..  ఇక బీజేపీ టీడీపీ జన సేనల పొత్తు ఉండకపోవచ్చన్న చర్చ ప్రస్తుతం ప్రారంభం అయింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..