అంకుశం వర్సెస్‌ రంగస్థలం.. అటు టీడీపీ ఇన్‌చార్జ్.. ఇటు వైసీపీ ఎమ్మెల్యే.. కాకరేపుతోన్న ప్రొద్దుటూరు పాలిటిక్స్

అంకుశం వర్సెస్‌ రంగస్థలం..ఇదేదో సినిమా ఫైట్‌ కాదు..ప్రొద్దుటూరులో వాలంటీర్లకు, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కు మధ్య నడుస్తున్న ఫైట్‌.. వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తానంటూ ప్రవీణ్‌రెడ్డి వార్నింగ్‌ ఇస్తే..

అంకుశం వర్సెస్‌ రంగస్థలం.. అటు టీడీపీ ఇన్‌చార్జ్.. ఇటు వైసీపీ ఎమ్మెల్యే.. కాకరేపుతోన్న ప్రొద్దుటూరు పాలిటిక్స్
Tdp Ysrcp

Updated on: Mar 02, 2024 | 9:00 PM

అంకుశం వర్సెస్‌ రంగస్థలం..ఇదేదో సినిమా ఫైట్‌ కాదు..ప్రొద్దుటూరులో వాలంటీర్లకు, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కు మధ్య నడుస్తున్న ఫైట్‌.. వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తానంటూ ప్రవీణ్‌రెడ్డి వార్నింగ్‌ ఇస్తే.. మేమే మీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ వాల్లంటర్లు కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

కడపజిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీకి ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయంటూ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను అంకుశం సినిమాలో రాంరెడ్డిని కొట్టినట్లు కొడుతూ ఊరేగిస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతూ ధర్నాకు దిగారు. ఆయన అంకుశం సినిమా చూపిస్తే.. తాము రంగస్థలం చూపిస్తామని గట్టి కౌంటర్‌ ఇచ్చారు వాలంటీర్లు.

ఈ వ్యవహారం కాస్తా పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు. వాలంటీర్లను టచ్‌ చేస్తే ప్రవీణ్‌రెడ్డి సంగతేంటో చూస్తామని వార్నింగ్ ఇచ్చారాయన. ముగ్గురు పెళ్లాలను మార్చి, మూడు జెండాలతో జతకట్టేవ్యక్తి కూడా.. వాలంటీర్ల గురించి మాట్లాడుతారంటూ మండిపడ్డారు. వాలంటీర్‌ వ్యవస్థను చూసి భయపడే ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రవీణ్‌రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే తమ సత్తా ఏంటో ప్రవీణ్‌కు చూపిస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు.

అటు 70 శాతం మంది వాలంటీర్లు చాలా భాగా పనిచేస్తున్నారని, 30 శాతం మంది మాత్రమే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. తానూ 30 శాతం మందిని మాత్రమే అన్నానని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు ప్రవీణ్‌రెడ్డి. మొత్తానికి ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రొద్దుటూరులో రాజకీయ దుమారం రేపుతోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.