Chandrababu Naidu: ముఖ్యమంత్రి ఉదాసీనత వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.. గోరంట్ల మాధవ్ వీడియోపై చంద్రబాబు కౌంటర్

| Edited By: Ravi Kiran

Aug 10, 2022 | 8:26 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూడాల్సిన పరిస్థితి పట్టిందని...

Chandrababu Naidu: ముఖ్యమంత్రి ఉదాసీనత వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.. గోరంట్ల మాధవ్ వీడియోపై చంద్రబాబు కౌంటర్
Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూడాల్సిన పరిస్థితి పట్టిందని మండిపడ్డారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, మరోసారి ఇంకెవరూ ఇలాంటి చర్యలు తీసుకోకుండా దండించాలని అలా చేస్తేనే ఇలాంటి వారికి భయం వస్తుందని పేర్కొన్నారు. వైసీపీ (YCP) పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ వీటిని చూసి, చూడనట్లు వదిలేయడం వల్లే ఇవి రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలే పోలీసులను చంపే పరిస్థతి రాష్ట్రంలో ఉండటాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఏ వైపు పయనిస్తుందో అర్థమవుతోందని వివరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్టీఆర్‌ హయాంలోనే జీవో 3 తీసుకువస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవోను కాలరాస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ గిరిజనులకు గోరంతలు చేసి కొండంతలుగా చేసినట్లు చెప్పుకుంటోంది. లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వి గిరిజన సంపదను కొల్లగొడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన 18 గిరిజన సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ నిర్వీర్యం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ సర్కార్ రద్దు చేసిన గిరిజన కార్యక్రమాలు, పథకాలను పునరుద్ధరిస్తాం.

 – చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన నగ్నంగా మాట్లాడుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఎంపీ మాధవ్.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, జిమ్ లో ఉన్న సమయంలో టీడీపీ నేతలు వీడియోను మార్ఫింగ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీడియోలో ఉన్నది మాధవ్ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తాజాగా హోం మంత్రి తానేటి వనిత సైతం స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పుగానే చూస్తామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వంపై బురదచల్లేందుకు రాజకీయ కుట్ర కోణంలో భాగంగా ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే వారిపై కూడా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..