Chandrababu: రాజమండ్రి ‘రా.. కదలిరా’ సభలో రసాభాస..చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..

|

Jan 29, 2024 | 4:51 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి కాతేరులో నిర్వహించిన రా..కదలి రా సభలో చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికోసం బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ బహిరంగ సభలు, అభ్యర్థుల ప్రకటనలు, తుదిజాబితాపై కసరత్తు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Chandrababu: రాజమండ్రి రా.. కదలిరా సభలో రసాభాస..చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..
Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి కాతేరులో నిర్వహించిన రా..కదలి రా సభలో చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికోసం బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ బహిరంగ సభలు, అభ్యర్థుల ప్రకటనలు, తుదిజాబితాపై కసరత్తు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సోమవారం జరిగిన కాతేరు సభలో రాజానగరం టికెట్‎ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజిపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజిపై చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబుపై కార్యకర్తలు పడబోయారు.

అదేక్రమంలో పలువురు బొకేలు, పూలదండలు తీసుకుని వచ్చి చంద్రబాబుకు ఇవ్వబోయారు. ఈ తోపులాటలో చంద్రబాబు ఒకవైపుకు ఒరిగారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై.. చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘రా.. కదలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాజోలు, రాజానగరం టికెట్‎ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థి ప్రకటన అనంతరం కార్యకర్తలు స్టేజిపై నుంచి కిందకు దూకుడుగా దిగడంతో చంద్రబాబు పడబోయారు. సొంత పార్టీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..