RK Roja: రోజా ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారా.? ఆమె మాటల్లోనే..

టిడిపి, జనసేనకు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక షర్మిలపై కూడా రోజా తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి...

RK Roja: రోజా ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారా.? ఆమె మాటల్లోనే..
Rk Roja
Follow us
Raju M P R

| Edited By: Narender Vaitla

Updated on: Jan 29, 2024 | 6:38 PM

తిరుపతిలో జరిగిన వైసీపీ రీజినల్ పార్టీ క్యాడర్ మీటింగ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా ఒంగోలు ఎంపీగా పోటీ పై క్లారిటీ ఇచ్చారు. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా క్లారిటీ ఇచ్చారు. నగరిలో ఎమ్మెల్యేగా పనిచేసుకుంటున్న తాను ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తనపై ప్రేమతో కొందరు పక్క రాష్ట్రాలకు తనని సీఎంను కూడా చేసేలా ఉన్నారని రోజా చమత్కరించారు.

టిడిపి, జనసేనకు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక షర్మిలపై కూడా రోజా తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిందన్నారు. షర్మిల వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుదేనని ఆమె మాటలకు విలువ లేదని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సంక్రాంతి అల్లుళ్లలాగా రాష్ట్రానికి వస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాళ్లు తన గురుంచి మాట్లాడుతుండడం సిగ్గుచేటని, పీలేరు సభలో తనపై చంద్రబాబు చేసిన విమర్శలను తిప్పుకొట్టారు రోజా.

నామినేటెడ్ పదవులకే కాదు, 10 ఏళ్లలో ఒక్క రూపాయి ఎక్కడా తాకలేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి గురించి ఎమ్మెల్యే అది మూలం మాటలు బాధ పెట్టాయన్నారు రోజా. ఆదిమూలంను గెలిపించింది పెద్దిరెడ్డి, అయితే ఇప్పుడు కక్ష్య సాధింపుగా ఆయన కుటుంబంపై మాట్లాడడం తగదన్నారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలన్న రోజా.. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని తెలిపారు. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారన్న రోజా.. ఎమ్మెల్యే ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..