Chandrababu Naidu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ కొట్టివేత..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు బెయిల్ ప్రభావం ఉంటుందని.. దీనివల్ల ఆధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. అయితే దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని న్యాయస్థానం తెలిపింది. ఒకవేళ.. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం కోరిన విధంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది.
2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని.. చాలామంది ముందస్తు బెయిల్ పై ఉన్నారని.. చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో కూడా 17ఏ నిబంధన వర్తిస్తే ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
వీడియో చూడండి..
కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబును పేరును సెప్టెంబర్ 12న చేర్చారు. ఆ తర్వాత చంద్రబాబుపై దాఖలైన పలు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..