Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: మరింతగా విస్తరించనున్న రుతుపవనాలు.. రాగల మూడు రోజుల్లో ఏపీలో వర్ష సూచన

Weather Report: ఉత్తర అరేబియా సముద్రం, ముంబైతో సహా మొత్తం కొంకన్ మరియు అంతర్గత మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,..

Weather Report: మరింతగా విస్తరించనున్న రుతుపవనాలు.. రాగల మూడు రోజుల్లో ఏపీలో వర్ష సూచన
Weather Report
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2021 | 4:54 PM

Weather Report: ఉత్తర అరేబియా సముద్రం, ముంబైతో సహా మొత్తం కొంకన్ మరియు అంతర్గత మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య బంగాళాఖాతములోని బెంగాల్, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మొత్తం పశ్చిమ బెంగాల్, బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఉత్తర బంగాళాఖౄతం, పరిసరాల్లో జూన్‌ 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఏపీలో రాగల మూడు రోజుల్లో వర్షాలు

రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!

Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు