పేద, మధ్య తరగతి ప్రజలకు పొదుపు చేసుకునేంత సంపాదన ఉండదు. వచ్చిన దాంట్లో ఖర్చులకు పోగా ఎంతోకొంత వెనకేసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం తాముండే ప్రాంతంలో చిన్నమొత్తాల్లో చిట్టీలు వేస్తుంటారు. కొందరు వేలల్లో చిట్టీలు(Chitfunds) కడితే.. మరికొందరు కాస్త ధైర్యం చేసి లక్షల్లో వేస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పైసాపైసా కూడబెట్టి నెలనెలా చిట్టీలు కడుతుంటారు. ఈ క్రమంలో డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చిట్టీలు, స్కీం లు, ఆఫర్ లు వంటి వాటితో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తియ్యగా మాటలు చెప్పి దగ్గరవుతున్నారు. జనాల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు(Cheating). సరైన సమయం చూసుకుని డబ్బుతో ఉడాయిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా(Chittoor district)లో ఇలాంటి ఘటనే జరిగింది. బంగారుపాళెంలో ఓ దొంగ స్వామీజీ అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్నాడు. ఇలా వారి నుంచి రూ.25కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దొంగ స్వామీజీపై పలు సెక్షన్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా గండికోట ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి.. పదిహేనేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓం శక్తి ఆలయంలో పూజారిగా చేరి, గుడిలో మాల ధరించే మహిళా భక్తులతో లక్షలాది రూపాయల చీటీలు వేయించి మోసం చేశాడు. ఇలా రూ.25 కోట్లు వసూలు చేశాడు. వారం క్రితం ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలతో సహా రాత్రికి రాత్రే పరారయ్యాడు. విషయం తెలుసుకునన్న బాధితులు.. తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. చీటీల ముసుగులో మోసం చేసి పరారైన దొంగ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 420, 406, వివిధ చట్టాల ఆధారంగా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న స్వామిజీ కోసం గాలింపు చేపట్టారు.
Also Read