Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, జనసేన నేతల డిమాండ్

పవన్ హత్యకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి.. జనసేనానికి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన నేతలు. అంతేకాదు పవన్ భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, జనసేన నేతల డిమాండ్
Suspicious Persons at Pawan Kalyan House

Updated on: Nov 03, 2022 | 3:02 PM

హైదరాబాద్ లో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు.. పవన్ కల్యాణ్ పై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని జనసేన జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.. బుధవారం నాదెండ్ల మనోహర్ ఇదే అంశంపై రెస్పాండ్ అయ్యారు. ఇవాళ తిరుపతిలో హరిప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశంపై ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. పవన్ హత్యకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి.. జనసేనానికి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన నేతలు కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్. అంతేకాదు పవన్ భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహణతో అనేక అనుమానలున్నాయని చెప్పారు. ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే అని చెప్పారు. అన్ని సర్వేలలో పవన్ సిఎం అవుతారని రావడంతో పవన్ పై కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణా డీజీపీని డిమాండ్ చేశారు. రెక్కీ నిర్వహించి న అపరిచితులు వెనుక ఏ శక్తులు ఉన్నా యున్న విషయం బహిరంగ పర్చాలని కోరారు. అంతేకాదు
పవన్ కళ్యాణ్ కు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

ఇవి కూడా చదవండి