Andhra Pradesh: పొలం షెడ్డులో విగతజీవిగా.. సత్యసాయి జిల్లాలో మిస్టరీగా యువతి మరణం

ప్రేమ చావుకొచ్చిందా..? నమ్మినోడే గొంతుకోశాడా..? సత్యసాయి జిల్లాలో యువతి డెత్‌ మిస్టరీగా మారింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు కమ్ముకుంటున్నాయి.

Andhra Pradesh: పొలం షెడ్డులో విగతజీవిగా.. సత్యసాయి జిల్లాలో మిస్టరీగా యువతి మరణం
Suspicious Death

Updated on: May 06, 2022 | 9:36 AM

Sathya Sai district: తోటలో ఏం జరిగింది? హత్యా? ఆత్మహత్యా? సత్యసాయి జిల్లాలో యువతి మృతికి కారకులెవరు? బి.ఫార్మసీ విద్యార్థిని మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. రేప్‌ చేసి.. హత్యచేశారన్నది బంధువుల ఆరోపణ. ఈ క్రమంలో రీపోస్ట్‌మార్టంకు డిమాండ్ చేయడంతో.. కాసేపట్లో మరోసారి పోస్ట్‌మార్టం చేయనున్నారు వైద్యులు. ఇప్పటికే పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. గోరంట్ల మండలానికి చెందిన యువతి తిరుపతిలో బి.ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. మల్లాపల్లిలో యువతి డెడ్‌బాడీ కనిపించడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. స్నేహితుడు సాధిక్ ఫోన్ చేయడంతో ఆమె తిరుపతి నుంచి వచ్చినట్లు పోలీసులు తేల్చారు. నాల్గో తేదీ సాయంత్రం ఇద్దరు చాలా సేపు తోటలో ఉన్నారు. ఆ తర్వాత సాధిక్ ఇంటికి వెళ్లడంతో తిరిగొచ్చే సరికి డెడ్‌బాడీ కనిపించిందని అతను చెప్పినట్లు పోలీసులు వివరిస్తున్నారు. తోటలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో పెళ్లి విషయం చర్చకు వచ్చింది.

ఇది ముమ్మాటికి హత్యే అంటున్నారు యువతి బంధువులు, ప్రజాసంఘాలు. తిరుపతి నుంచి పిలిపించి, గ్యాంగ్‌ రేప్ చేసి.. హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఘటనను అంతు తేల్చాలంటూ.. ఆందోళనకు దిగారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిన్న పోస్ట్‌మార్టంను వీడియోగ్రఫి చేసిన పోలీసులు.. ఇవాళ మరోసారి పోస్ట్‌మార్టం జరుగుతున్న సమయంలో చిత్రీకరించనున్నారు. సాధిక్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. ఆత్మహత్యగా చెప్తున్నారు. అయితే యువతి ఒంటిపై గాయాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. గోరంట్లకు చెందిన యువతి తిరుపతి నుంచి మల్లాపల్లికి వచ్చినట్లు పేరెంట్స్‌కు తెలియకపోవడం.. మృతిపై డౌట్స్ పెంచుతోంది.

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?