Chandrababu Arrest: చంద్రబాబుకు బెయిల్‌పై టెన్షన్.. టెన్షన్.. ఇవాళ సుప్రీం, ఏసీబీ కోర్టులో కీలక విచారణ..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఓ వైపు చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడగింపు.. మరోవైపు బెయిల్ పిటీషన్లపై విచారణతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ కీలక విచారణ జరిగింది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలను మంగళవారం వింటామని విజయవాడ ఏసీబీ కోర్టు విచారణను ఇవ్వాల్టికి వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఓ వైపు చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడగింపు.. మరోవైపు బెయిల్ పిటీషన్లపై విచారణతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ కీలక విచారణ జరిగింది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలను మంగళవారం వింటామని విజయవాడ ఏసీబీ కోర్టు విచారణను ఇవ్వాల్టికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంలో ఇవాళ కీలక విచారణ జరగనుంది. సెక్షన్ 17ఏ ను ప్రస్తావిస్తూ చంద్రబాబు పిటిషన్ వేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని.. ఇది చెల్లదని.. కేసు కొట్టివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు విన్నవించారు. ఏపీ హైకోర్టులో కొట్టివేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ.. చంద్రబాబు తరుపు న్యాయవాదులు.. సుప్రీంను ఆశ్రయించారు. నిన్న వాద ప్రతివాదనలను విన్న ధర్మాసనం.. రేపు రావాలంటూ పేర్కొంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మొదట, చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేసి అత్యవసరంగా విచారించాలని కోరారు. దీంతో ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగ్గా ఈనెల 8న అరెస్ట్ చేశారని లూథ్రా తెలిపారు. దీంతో మంగళవారం మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని లూథ్రాకు సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.
అయితే, ఇటు ఏసీబీ, అటు సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో.. చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. రెండు న్యాయస్థానాలు తీర్పులు ఎలా ఇస్తాయోనని.. తెలుగు తమ్ముళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. బెయిల్, కస్టడీ, క్వాష్ పిటిషన్లపై కోర్టుల తీర్పులు ఎలా ఉండనున్నాయి.. ఒక వేళ బెయిల్ రాకపోతే.. పరిస్థితి ఏంటి..? సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా..? లేదా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. జైలులో అపరిశుభ్రతపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖాత్ అయ్యారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
