Banana Seller Zilani: జీవనోపాధి పోకూడదని కోటి విలువజేసే స్థలాన్ని కొనుగోలు చేసిన చిరు వ్యాపారి ఎక్కడో తెలుసా..!

|

Apr 02, 2021 | 4:55 PM

Banana Seller Zilani రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని వ్యాపారం చేసుకునే.. ఓ చిరు వ్యాపారికి అదే బతుకు దెరువు. బండి మీద అరటి పండ్లు పెట్టు అవి అమ్ముతూ బతుకు బండిని లాగిస్తున్నాడు. అయితే ఆ చిరు వ్యాపారి.. తన జీవనోపాధిని నిలుపుకోవడం..

Banana Seller Zilani: జీవనోపాధి పోకూడదని కోటి విలువజేసే స్థలాన్ని కొనుగోలు చేసిన చిరు వ్యాపారి ఎక్కడో తెలుసా..!
Banana Seller Zilani
Follow us on

Banana Seller Zilani: రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని వ్యాపారం చేసుకునే.. ఓ చిరు వ్యాపారికి అదే బతుకు దెరువు. బండి మీద అరటి పండ్లు పెట్టు అవి అమ్ముతూ బతుకు బండిని లాగిస్తున్నాడు. అయితే ఆ చిరు వ్యాపారి.. తన జీవనోపాధిని నిలుపుకోవడం కోసం కేవలం 108 చదరపు అడుగుల స్థలాన్ని వేలంలో కోట్లు ఖర్చు పెట్టాడు. దీంతో అతను చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. ఓ తోపుడు బండిపై అరటి పండ్లు అంమ్ముకుని జీవించే వ్యక్తి బడా వ్యాపార వేత్తలా.. రియాల్టర్ లా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్య పరచింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన చిరు వ్యాపారి ఎస్‌కే జిలాని . ఇతను ముంబై జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఒకే చోట 40 ఏళ్లుగా తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలోని పాత షాపులు తీసేసి.. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని నిర్వాహకులు భావించారు. ఈ విషయం జిలానికి తెలిసింది.
కాంప్లెక్స్‌ కడితే అక్కడి నుంచి తనను పంపించేస్తారని, జీవనాధారం పోతుందని ఆందోళన చెందాడు. అందుకనే అదే కాంప్లెక్స్‌లో కొంచెం స్థలంఅయినా సరే కొనుక్కోవాలని భావించాడు. దీంతో వేలం వేస్తున్న సమయంలో జిలానీ కూడా పాల్గొన్నాడు. 108 చదరపు అడుగుల (ఒకటిన్నర అంకణం) స్థలాన్ని రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్నాడు.

Also Read: అకౌంట్స్‌లో మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? NHAI లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ ఆకుకూరని ట్రై చేయండి