Watch Video: అల్లూరి జిల్లాలో అద్భుతం.. వాటంతట అవే గుండ్రంగా తిరుగుతున్న అమ్మవారి గాజులు..

అల్లూరి జిల్లాలో అమ్మవారి ఊరేగింపులో జరిగిన ఓ అద్భుత ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఆ వివరాలు మీ కోసం....

Watch Video: అల్లూరి జిల్లాలో అద్భుతం.. వాటంతట అవే గుండ్రంగా తిరుగుతున్న అమ్మవారి గాజులు..
Strange Incident

Updated on: Oct 09, 2022 | 5:58 PM

అల్లూరి జిల్లా, కూనవరం మండలం జగ్గవరంలో వింత ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మవారి విగ్రహం వద్ద కలశంపై భక్తులు సమర్పించిన గాజులు వాటంతటవే కదలడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నవరాత్రి అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల్లో జరిగిన ఈ అద్భుతం స్థానికంగా హల్‌చల్‌ చేస్తోంది. అమ్మవారి మహత్యం వల్లే ఇలా జరిగిందంటున్నారు స్థానికులు. తల్లి తమ పూజలకు మెచ్చి.. చల్లని ఆశీస్సులు ఇలా చూపిందని చెబుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని.. ఈ వింతను ఫోన్లలో బంధించారు. ప్రజంట్ ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

 

వైభవంగా విజయనగరం ఉత్సవాలు

సాంస్కృతిక రాజధాని విజయనగరం… సంబరాల్లో మునిగి తేలుతోంది. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద జెండా ఊపి ఉత్సవాల్ని లాంఛనంగా ప్రారంభించారు మత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.జోరు వాన కురుస్తున్నా ఉత్సవ ర్యాలీలో వందలాది మంది విజయనగరవాసులు పాల్గొన్నారు. చిన్నపిల్లల స్కేటింగ్… సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. విజయనగరం చరిత్ర, వైభవాన్ని భవిష్యత్ తరాలకు చాటిచెప్పేలా ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆనంద గజపతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, గురజాడ కళాభారతిలో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో ఫల, పుష్ప ప్రదర్శన ఉంటుంది. ఉత్సవ ర్యాలీలో సంప్రదాయ నృత్యాలతో అలరించారు కళాకారులు. వీళ్లతో కలిసి ఎమ్మెల్సీ ఇoదుకూరి రఘురాజు, ఆర్డీవో సూర్యకళ కూడా కాలు కదిపి స్టెప్పులేశారు. వీళ్ల జోష్‌ని చూసి మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, ఇతర ప్రజాప్రతినిధులు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..