Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku Coffee: రికార్డులు సృష్టిస్తున్న అరకు కాఫీ.. ఈ కాఫీ కప్పు అక్షరాలా 637 రూపాయలు.. ఎందుకంటే..?

Araku Coffee: రికార్డులు సృష్టిస్తున్న అరకు కాఫీ.. ఈ కాఫీ కప్పు అక్షరాలా 637 రూపాయలు.. ఎందుకంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 09, 2022 | 6:37 PM

గతేడాది అంతర్జాతీయంగా కాఫీ గింజల ఉత్పత్తి తగ్గడంతో అరకు కాఫీకి బయటి మార్కెట్‌లో మంచి ధర లభించింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలు సాధారణంగా కిలో 150 నుంచి 180 రూపాయల ధర ఉండేది.


సాధారణంగా కాఫీ పంటను బ్రెజిల్‌లోనూ, ఇటు భారత దేశంలోను ఎక్కువగా సాగుచేస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరులో కూడా కాఫీ సాగు జోరందుకుంది. అయితే ఇప్పటి వరకూ దీనికి అంత ప్రాముఖ్యత లభించలేదు. కానీ ప్రస్తుతం బ్రెజిల్‌, కర్నాటకలలో కాఫీ ఉత్పత్తి గణీయంగా తగ్గిపోవడంతో అరకు కాఫీకి డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు అరకు కాఫీ అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తోంది. మన కాఫీ బ్రాండ్‌ ఇమేజ్‌ను విదేశీ మార్కెట్‌లో సుస్థిరం చేస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో కప్పు అరకు కాఫీని ఏడు పౌండ్లకు విక్రయిస్తున్నారు. ఏడు పౌండ్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో కాస్త అటుఇటుగా 637 రూపాయలు. పాడేరు కాఫీ ప్రాజెక్ట్‌ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో అరబికా, రోబస్టా చెర్రీ కాఫీ రకాలను సాగు చేస్తున్నారు. ఇదే కాఫీ రకాలను సేంద్రీయ పద్ధతిలో కూడా సాగు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది అంతర్జాతీయంగా కాఫీ గింజల ఉత్పత్తి తగ్గడంతో అరకు కాఫీకి బయటి మార్కెట్‌లో మంచి ధర లభించింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలు సాధారణంగా కిలో 150 నుంచి 180 రూపాయల ధర ఉండేది. గత ఏడాది చివరిలో నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో తొక్క తీసిన కాఫీ గింజలు కిలో 350 నుంచి 380 రూపాయలకి పైగా ధర లభించింది. బెంగళూరులోని అనేక ప్రైవేటు సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరిస్తాయి. ఆ గింజలను శుద్ధి చేసి ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడిగా, వివిధ రకాల కాఫీ పొడులుగా మార్చి ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తాయి. అయితే, వ్యాపారులు అరకు కాఫీ పొడి పేరుతోనే బెంగళూరును కేంద్రంగా చేసుకుని బ్రెజిల్, జపాన్‌ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 09, 2022 06:37 PM