AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections: ఏపీ ఎస్‌ఈసీ మరో ట్విస్ట్‌.. ఏకగ్రీవాలు ఆపండి.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై కీలక ఆదేశాలు

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో రోజుకో ట్విస్ట్‌ నెలకొంటోంది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు..

AP Panchayat Elections: ఏపీ ఎస్‌ఈసీ మరో ట్విస్ట్‌.. ఏకగ్రీవాలు ఆపండి.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై కీలక ఆదేశాలు
Subhash Goud
|

Updated on: Feb 05, 2021 | 11:18 AM

Share

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో రోజుకో ట్విస్ట్‌ నెలకొంటోంది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, చిత్తూరులో ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామని ఎస్‌ఈసీ తెలిపింది. ఈ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవాలు జరిగాయి. అయితే నివేదికల పరిశీలన పెండింగ్‌ లో ఉందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు వివరణాత్మక నివేదికలు పంపాలని సూచించింది. సర్పంచ్‌ల ఏకగ్రీవాల విషయంలో నివేదికల ప్రకారం తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపింది.

కాగా, రాష్ట్రంలో తొలి విడతలో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, గుంటూరు జిల్లాలో 67 కర్నూలు జిల్లాలో 54, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 34, పశ్చిమగోదావరి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా ఏకగ్రీవాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:

92 Year old Grand Mother Nomination: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్

AP Panchayat Elections: సర్పంచ్‌ల ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌