Srisailam Temple: తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీలోని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిల సవాళ్లు.. ప్రతిసవాళ్లు అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. చక్రపాణి రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ ఆరోపించగా.. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ రాజాసింగ్‌కు చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగా.. రాజాసింగ్, చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలపై శ్రీశైలం ఈవో కేఎస్ రామారావు స్పందించారు. శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు గతంలో షాపులు కేటాయించిన మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే.. అన్యమతస్తుల షాపులు తొలగించేందుకు నోటీసులు కూడ ఇచ్చామని రామారావు తెలిపారు. అన్యమతస్తుల షాపుల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉందని, కోర్టు తీర్పును ఆధారంగా షాపులపై నిర్ణయం తీసుకుంటామని ఈఓ కెఎస్ రామారావు స్పష్టం చేశారు. అయితే, తాను వచ్చాక శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఎవరికి షాపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగాలు కూడ ఇవ్వలేదన్నారు. గంటామఠం పునర్నిర్మాణంపై వస్తున్న ఆరోపణలను సైతం ఆయన తోసిపుచ్చారు. ఆ పనుల సందర్భంగా లభ్యమైన బంగారు వెండి నాణేలను రికార్డెడ్‌గా ఉంచామని తెలిపారు. ఇక వజ్రాలు వైడూర్యాలు లాంటివి దొరకలేదని రామారావు స్పష్టం చేశారు.
Also read:
MURDER IN KARNOOL: వారం రోజుల్లో వివాహం.. ఇంతలోనే దారుణం.. కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలు..