MURDER IN KARNOOL: వారం రోజుల్లో వివాహం.. ఇంతలోనే దారుణం.. కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలు..
కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూర్ వద్ద మొగల్ గఫార్ అనే యువకుడిని గుర్తు తెలియని ...
MURDER IN KARNOOL: కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూర్ వద్ద మొగల్ గఫార్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అధికారిక సమాచారం ప్రకారం.. మొగల్ గఫార్ ఆళ్లగడ్డ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కొందరు దుండగులు అటకాయించి దాడి చేశారు. కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గఫార్ స్పాడ్ డెడ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గఫార్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో వారం రోజుల్లో ఆళ్లగడ్డకు చెందిన యువతితో పెళ్లి జరగనుంది. ఇంతలోనే దారుణ హత్యకు గురవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ