Srisaila Mallanna Hundi: రికార్డు స్థాయిలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం.. భక్తుల కానుకలుగా బంగారం, వెండి

|

Jan 19, 2021 | 9:41 PM

Srisaila Mallanna Hundi: కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో వచ్చి చేరింది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి..

Srisaila Mallanna Hundi: రికార్డు స్థాయిలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం.. భక్తుల కానుకలుగా బంగారం, వెండి
Follow us on

Srisaila Mallanna Hundi: కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో వచ్చి చేరింది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల పరివార ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. 35 రోజులకు గాను రూ. 3,82,23,900 భక్తుల కానుకల రూపంలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. వీటితో పాటు బంగారం,వెండి కూడా వచ్చింది. అలాగే 153.900 గ్రాముల బంగారం, 4.700 కిలోల వెండి, 200 యూఎస్‌ డాలర్స్‌, 156 యూఏఈ ధరమ్స్‌, 15 యూరోలు, ఐదు కెనడా డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు.

కాగా, మంగళవారం సందర్భంగా ఆలయంలో కుమారస్వామికి పంచామృతాభిషేకాలు, బయలు వీరభద్రునికి ప్రదోషకాల పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. అలాగే అదే శివభక్త గణాలకు అధిపతి, క్షేత్ర పాలకుడైన వీరభద్రుడికి సాయం కాలం ప్రదోషకాల పూజలు శాస్తోక్తంగా నిర్వహించారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం సంధ్యా సమయంలో నంది మండలంలో కొలువైన నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి