శ్రీకాళహస్తిలో నంది విగ్రహం ధ్వంసం… తీగ లాగితే కదిలిన డొంక… ఇది వారి పనే అని తేల్చిన పోలీసులు

|

Apr 11, 2021 | 7:13 PM

హైదరాబాద్‌కు చెందిన బురిడీ బాబ మాటలు నమ్మిన పదిమంది కటకటాలపాలయ్యారు. పురాతన నంది విగ్రహంలో 60కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయని...

శ్రీకాళహస్తిలో నంది విగ్రహం ధ్వంసం... తీగ లాగితే కదిలిన డొంక... ఇది వారి పనే అని తేల్చిన పోలీసులు
Nandi Idol Destroy
Follow us on

హైదరాబాద్‌కు చెందిన బురిడీ బాబ మాటలు నమ్మిన పదిమంది కటకటాలపాలయ్యారు. పురాతన నంది విగ్రహంలో 60కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయని నమ్మి  10 మంది జైలు పాలు కావాల్సి వచ్చింది.  ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పలమనేరు పోలీసులు తీగ లాగితే శ్రీకాళహస్తిలో డొంక కదిలి ఏకంగా ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది.

హైదరాబాద్‌కు చెందిన అశ్వత్థామ అనే నకిలీ బాబా..అతడి శిష్యుడు హరి.. ఇద్దరూ కలిసి గుప్తనిధులకోసం శ్రీకాళహస్తి జిల్లాలోని పలు పురాతన ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. రెండేళ్ల క్రితం పలమనేరు పరిధి ఓ పురాతన శివాలయంలోని నంది విగ్రహంలో సుమారు 60కోట్ల విలువచేసే వజ్రాలు ఉన్నాయని హరిని బాబా నమ్మించాడు. దీంతో ఈ విగ్రహం ఎత్తుకొచ్చేందుకు శ్రీకాళహస్తికి చెందిన కొందరితో హరి తాజాగా మాట్లాడి రూ. 10 లక్షలు ఇస్తామని డీల్ సెట్ చేసుకున్నాడు.

ఈ నెల 4న శివాలయంలో నంది విగ్రహం మాయమైనట్లు గుర్తించిన పూజారి వెంటనే పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. మొబైల్‌ డంపర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌టవర్‌ ద్వారా నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నళ్లను గుర్తించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా అశ్వత్థామ గురించి తెలిసింది. తిరుపతిలో ఉన్న అశ్వత్థామను కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాబా సహా మొత్తం పదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని.. పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు.

Also Read: లేగదూడలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న వింత జంతువు.. రాత్రయితే చాలు గుండెల్లో దడ

కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది.. గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..