PM Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

PM Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
Modi Condoles The Srikakulam Stampede

Updated on: Nov 01, 2025 | 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలతో పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై పులువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మోదీ ఎక్స్‌గ్రేషియా

వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘తమ సన్నిహితులను, ఆప్తులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

అమిత్ షా సంతాపం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ దుర్ఘటనపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రమాదానిక గల కారణాలు

మరోవైపు ఆలయంలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్టు భక్తుల ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం 3 వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. కానీ ఇవాళ ఏకాదశి కావడంతో 25 వేల మందికి పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పోట్టెత్తడంతో కంట్రోల్‌ చేయడంలో అధికారులు విఫలమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.