Narasannapet: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. స్టీరింగ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా..

స్టీరింగ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు బస్సులోని ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Narasannapet: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. స్టీరింగ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా..
APSRTC

Updated on: Jun 06, 2023 | 2:35 PM

శ్రీకాకుళం జిల్లా: స్టీరింగ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు బస్సులోని ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం వైపు ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ చేతిలోని స్టీరింగ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు 19 మంది ప్రయాణికులకు గాయపడ్డాయి.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డుకు అడ్డంగా బస్సు బోల్తా పడటంతో ఆ మార్గంలో వచ్చే ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై బారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.