Sandalwood: కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు.!! గుట్టల కొలదీ గంధపు చెక్కలు

|

Aug 14, 2021 | 4:21 PM

కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు వీస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే గంధపు చెక్కలను అక్రమంగా నిల్వ ఉంచిన ఘటన

Sandalwood: కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు.!! గుట్టల కొలదీ గంధపు చెక్కలు
Gandham
Follow us on

Srigandham: కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు వీస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే గంధపు చెక్కలను అక్రమంగా నిల్వ ఉంచిన ఘటన అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేరళ, తమిళనాడు నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఒక ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్‌లో దాచిన శ్రీగంధంతో పాటు శాండిల్ ఉడ్ ఆయిల్‌ను పోలీసులు గుర్తించారు.

అమరాపురం మండలం బసవనపల్లి యునైటెడ్ ఆయిల్ ఇండస్ట్రీలో ఈ నిల్వలు బయపడ్డాయి. మడకశిర పోలీసులతోపాటు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ రైడ్స్ లో ఆసక్తికర విషయాలు వెలుగులో వచ్చాయి. కోటి 27లక్షలు విలువ చేసే మొత్తం 3983.45 కిలోల శ్రీగంధం చెక్క ముక్కలు, 16 కిలోల శ్యాండిల్ ఉడ్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

నిల్వ ఉంచిన ప్రదేశాన్ని పొట్టుతో నింపి కింద అండర్ గ్రౌండ్‌లో అక్రమంగా సరుకు దాచేందుకు వీలుగా నిర్మాణాలు చేసుకున్నారు. వీటిలోనే శ్రీ గంధం చెక్క ముక్కలుతో నింపిన 188 సంచులు ఉంచారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ఫ్యాక్టరీల నుండి సరుకు సక్రమంగా తెప్పిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నా ఇదే ముసుగులో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి తెప్పించి అక్రమంగా భారీ సరుకు దాచినట్లు బయటపడింది.

శ్రీ గంధం చెక్కలను అక్రమ నిల్వ చేసుకున్న ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ రెహమాన్, ఇతని భాగస్వామి కె.పి.మహమ్మద్ కుట్టీ పరారీలో ఉన్నారు. సూపర్ వైజర్ అయిన కేరళకు చెందిన క్రిష్ణను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

Sri Gandham

Read also: Panakam: మంగళగిరి నరసింహస్వామి వారి ‘పానకం’ రేటెంతో తెలుసా..? అక్షరాలా రూ. ఒక కోటి 35 లక్షలు.!