సతీ సమేతంగా హనుమాన్..

| Edited By:

Jul 06, 2019 | 4:00 PM

అస్కలిత బ్రహ్మచారి ఎవరని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆంజనేయస్వామి పేరే. మనకు తెలిసి హనుమాన్ విగ్రహాన్ని ఎక్కడ చూసినా సీతారాముల పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఒకవేళ స్వామికే ప్రత్యేకమైన ఆలయం ఉంటే అందులో కూడా ఒక్కడే దర్శనమిస్తాడు. కానీ సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చే ఆలయం ఒకటుందని మీకు తెలుసా? ఈ వార్త ఆశ్చర్యం కలిగించేదే మరి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో యానాం వెళ్లే దారిలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న హనుమాన్ .. […]

సతీ సమేతంగా హనుమాన్..
Follow us on

అస్కలిత బ్రహ్మచారి ఎవరని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆంజనేయస్వామి పేరే. మనకు తెలిసి హనుమాన్ విగ్రహాన్ని ఎక్కడ చూసినా సీతారాముల పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఒకవేళ స్వామికే ప్రత్యేకమైన ఆలయం ఉంటే అందులో కూడా ఒక్కడే దర్శనమిస్తాడు. కానీ సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చే ఆలయం ఒకటుందని మీకు తెలుసా? ఈ వార్త ఆశ్చర్యం కలిగించేదే మరి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో యానాం వెళ్లే దారిలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న హనుమాన్ .. శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.

సూర్యభగవానుని కుమార్తె సువర్చలాదేవి.. ఆమెను ఆంజనేయునికిచ్చి వివాహం జరిపించాడట సూర్యుడు. ఆతర్వాత పలు విద్యలు నేర్చుకునే వీలు కలిగిందని.. కేవలం విద్య కోసమే వివాహం తప్ప సంసారం కోసం కాదంటున్నారు ఆలయ పండితులు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొలువైన శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు.