Summer Trains: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రూట్లలో 8 ప్రత్యేక ట్రైన్స్.!

|

Jun 01, 2022 | 7:27 PM

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. వేసవి సీజన్‌ దృష్ట్యా ఆ రెండు రూట్లలో మరో 8 స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు..

Summer Trains: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రూట్లలో 8 ప్రత్యేక ట్రైన్స్.!
Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. వేసవి సీజన్‌ దృష్ట్యా ఆ రెండు రూట్లలో మరో 8 స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సమ్మర్ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని క్రమబద్దీకరించేందుకు జూన్ 4వ తేదీ నుంచి హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు.. అలాగే తిరుపతి-కాకినాడ టౌన్-తిరుపతి మధ్య 4 స్పెషల్ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. వీటిల్లో ఏసీ- 2 టైర్, ఏసీ – 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని ప్రకటించింది.

స్పెషల్ ట్రైన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ట్రైన్ నెం.07509/07510 హైదరాబాద్ – తిరుపతి – హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు)

ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల(07510 ట్రైన్‌ ఈ స్టాప్‌లో ఆగదు), మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గూటీ, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

ట్రైన్ నెం.07531/07532 తిరుపతి – కాకినాడ టౌన్ – తిరుపతి ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు)

ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

నాందేడ్ – మేడ్చల్ ట్రైన్ సమయంలో మార్పు…

07971 – హజూర్ సాహిబ్ నాందేడ్ – మేడ్చల్ మధ్య నడిచే పాసింజర్ స్పెషల్ ట్రైన్ సమయాల్లో సాంకేతిక కారణాల వల్ల మార్పులు జరిగాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 2, 3 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం ఉదయం 4.55 గంటలకు బయల్దేరాల్సిన ట్రైన్.. 1 గంట 40 నిమిషాల ఆలస్యంగా ఉదయం 6 గంటల 35 నిమిషాలకు బయల్దేరుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.