ఆ ప్రాంతంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు..

| Edited By: Srikar T

Jun 19, 2024 | 5:02 PM

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో భారీగా డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. వాంతులు, విరోచనాలతో రోగులు భారీగా హాస్పటల్‎లో చేరుతున్నారు. ఐదు రోజులు క్రితం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలి సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. నాగమణి అనే ఒక మహిళా వ్యాధి విజృంభించి మృతి చెందింది. వైద్యాధికారులు హుటాహుటిన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు మెరిగైన చికిత్స అందిస్తున్నారు. కొమ్మనపల్లిలో ఇప్పుడిప్పుడే వ్యాధి తీవ్రత తగ్గుమొఖం పడుతుంది. అయితే బెండపూడి గ్రామంలో తిరిగి డయేరియా విజృంభించింది.

ఆ ప్రాంతంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు..
Diarrhea
Follow us on

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో భారీగా డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. వాంతులు, విరోచనాలతో రోగులు భారీగా హాస్పటల్‎లో చేరుతున్నారు. ఐదు రోజులు క్రితం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలి సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. నాగమణి అనే ఒక మహిళా వ్యాధి విజృంభించి మృతి చెందింది. వైద్యాధికారులు హుటాహుటిన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు మెరిగైన చికిత్స అందిస్తున్నారు. కొమ్మనపల్లిలో ఇప్పుడిప్పుడే వ్యాధి తీవ్రత తగ్గుమొఖం పడుతుంది. అయితే బెండపూడి గ్రామంలో తిరిగి డయేరియా విజృంభించింది. జూన్ 19 అర్థరాత్రి సుమారు 18 మంది బాధితులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయానికి రోగుల సంఖ్య మరింత పెరగడంతో బెండపూడి ప్రాథమిక కేంద్రం వద్ద హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు.

పరిస్థితి విషమంగా వున్న వారిని కాకినాడ, తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇంకా తొండంగి మండలం పలు ప్రవేట్ హాస్పటల్‎లో కూడా బాధితులు ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన DMHO నరసింహ నాయక్ గ్రామంలో పర్యటించారు. అక్కడి పరిస్థితి పర్యవేక్షించాక అయన మాట్లాడుతూ తాగు నీరు వల్లే వ్యాధి ప్రభలిందని ప్రథమికంగా అంచనావేశారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని.. వ్యాధి తగ్గుమొఖం పడుతుంది ధైర్యం చెప్పారు. వ్యాధి తగ్గే వరకు గ్రామంలోని కలుషిత తాగు నీరు తాగవద్దని.. మంచినీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. విషయం తెలుసుకొన్న తుని ఎమ్మెల్యే యనమల దివ్య వ్యాధి ప్రభలిన గ్రామాల్లో హెల్త్ క్యాంపూలు ఏర్పాటు చేసి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులుకు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..