కోనసీమలో పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రక్షాళన మొదలైనట్టు కనిపిస్తోంది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే శాఖాపరమైన చర్యలు మొదలుపెట్టారు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బదిలీ వేటు వేశారాయన. ఆ జాబితాలో ముగ్గురు ASI, 9మంది హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే అంటున్నారు. నేరాలను ప్రోత్సహించడం, నిందితులకు సహకరించడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కొరడా ఝుళిపించారు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. ఏళ్ళుగా ఒకే చోటు పాతుకుపోయిన కొందరికి గట్టి షాక్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. సింగం వేట మొదలైందంటూ ఎస్పీపై స్థానికంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.