South Central Railway: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులు రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. పండుగకు ఊరెళ్లి తిరిగివచ్చే వారి కోసం 12 అన్ రిజర్వుడ్ రైళ్ల సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఉదయం 8.45 గంటలకు, విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణికులు గమనించగలరంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతోపాటు ఇక సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య ఉదయం 9.50 గంటలకు, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 2.55 గంటలకు, కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గంటలకు, కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గంటలకు అన్ రిజర్వుడ్ రైళ్లు నడుస్తాయి.
In order to clear extra rush of passengers, SCR will run Inter-City Special Trains between various destinations on 17th & 18th October, 2021.
All these special trains will run as Un-Reserved Express Specials #Dussehra #SpecialTrains pic.twitter.com/ajwS5iv8ia
— South Central Railway (@SCRailwayIndia) October 16, 2021
In order to clear #Dussehra extra rush, SCR will run #SpecialTrains between Machilipatnam – . Secunderabad – Machilipatnam on the days, stoppages & timings given below : pic.twitter.com/2okiOFJOQE
— South Central Railway (@SCRailwayIndia) October 16, 2021
Also Read: