Andhra: అమ్మాయికి మొగుడు… అత్తకు యముడు… ఎక్కడంటే..

కూతురు ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్న అనుమానంతో అతను కోపం పెంచుకున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో అత్తపై కత్తితో దాడి చేయగా, ప్రతిదాడిలో ఇతనికీ గాయాలయ్యాయి. గ్రామం, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. . . . .

Andhra: అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఎక్కడంటే..
Family Dispute

Edited By: Ram Naramaneni

Updated on: Dec 15, 2025 | 7:30 PM

ఆమె కూతురిని తాను చేసుకున్నాడు. తన కూతురిని ఆమె కొడుకుకు ఇచ్చి మేనరికం వివాహం చేశాడు. అయితే తన కూతురు తన అత్త ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ అల్లుడు అత్తకు యముడయ్యాడు. తన కూతురి చావుకు అత్తింటి ఆరళ్లే కారణమంటూ అత్తపై కత్తితో దాడి చేసి గొంతుపై గాయపర్చాడు… ఆగ్రహించిన బంధువులు అల్లుడిపై దాడి చేసి కొట్టారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపాయి.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన రమణమ్మ తన చిన్న కొడుకును అల్లుడు నారాయణ కూతురైన తన మనవరాలికి ఇచ్చి వివాహం చేసింది… 10 నెలల క్రితం కుటుంబంలో కలహాల కారణంగా నారాయణ కూతురు తన అమ్మమ్మ, అత్త అయిన రమణమ్మ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తన కూతురు చావుకి అత్త, ఆమె ఇంటి వారే కారణం అంటూ నారాయణ తరచూ గొడవ పడుతున్నాడు… ఈ నేపధ్యంలో తాజాగా తిరిగి గొడవ జరిగి ఘర్షణకు దారి తీయడంతో అత్త రమణమ్మపై అల్లుడు నారాయణ కత్తితో దాడి చేసి గొంతుకోయడంతో రమణమ్మకు గొంతుపై తీవ్రగాయమైంది… వెంటనే రమణమ్మ బంధువులు నారాయణపై ప్రతిదాడి చేయడంతో అతని తలపై గాయమైంది… దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త రవణమ్మపై అల్లుడు నారాయణ కత్తితో దాడి చేశాడు… అత్త రమణమ్మను ఆమె ఇంటి దగ్గరే కిందపడేసి కత్తితో గొంతు కోశాడు… బంధువులు ఎదురుదాడికి దిగడంతో నారాయణకు కూడా గాయాలయ్యాయి… బంధువులు ప్రతిఘటించడంతో అక్కడ నుండి పారిపోయాడు… రమణమ్మ గొంతు పై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను యర్రగొండపాలెం లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు బంధువులు… అత్తపై దాడి చేసిన అనంతరం అల్లుడు నారాయణ తన భార్యతో కలసి తనపై అత్త, బంధువులు దాడి చేసారంటూ అదే వైద్యశాలకు వచ్చాడు. దీంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది… వైద్యశాలలో కూడా కొట్టుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది… ఈ పరిణామంతో ప్రభుత్వ వైద్యశాలలోని వైద్య సిబ్బందితో పాటు రోగులు హడలి పోయారు… సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుండి పంపించి వేసారు… అత్త, అల్లుడు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవల కారణంగా గడ్డమీదపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది… గత కొంతకాలంగా అల్లుడు నారాయణ తన అత్తవారింటిపై ఆగ్రహంతో తరచూ తాగివచ్చి గొడవ చేస్తున్నాడని రమణమ్మ బంధువులు ఆరోపిస్తున్నారు… నారాయణ కూతురు చావుకు తన అత్త రమణమ్మే కారణమని కక్ష పెంచుకున్న నారాయణ ఆమెపై దాడి చేశాడని చెబుతున్నారు.

తన కూతురు చావుకు కారణం అత్తే అన్న అనుమానం…

యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లెలో చోటు చేసుకున్న ఈ ఘర్షణలు, దాడుల ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు… అత్త రమణమ్మకు, అల్లుడు నారాయణకు మధ్య కుటుంబ కలహాల కారణంగా ఈ దాడులు జరిగాయని యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య తెలిపారు… తన కూతురు చావుకు అత్తే కారణమన్న అనుమానంతో తరచూ అల్లుడు నారాయణ అత్త రమణమ్మతో గొడవలు పడుతున్నట్టు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య తెలిపారు.