కన్న కొడుకు ప్రాణాలను బలి తీసిన వివాహేతర సంబంధం..

| Edited By: Srikar T

Jun 25, 2024 | 7:17 PM

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం పట్టణ పరిధిలో గల ఓఎంఆర్ కాలనీలో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని రామచంద్రారెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలి ఉపయోగించి కడతేర్చాడు. చంపిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో వేసుకొని వెళ్లి ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో పడేశాడు. ఆతరువాత ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంటికి వచ్చి మృతుని తల్లికి టిఫిన్ ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు.

కన్న కొడుకు ప్రాణాలను బలి తీసిన వివాహేతర సంబంధం..
Murder
Follow us on

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం పట్టణ పరిధిలో గల ఓఎంఆర్ కాలనీలో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని రామచంద్రారెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలి ఉపయోగించి కడతేర్చాడు. చంపిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో వేసుకొని వెళ్లి ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో పడేశాడు. ఆతరువాత ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంటికి వచ్చి మృతుని తల్లికి టిఫిన్ ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే కొడుకు కోసం ఉదయం 7.30 సమయం తర్వాత తన గదికి వెళ్లి చూసిన తల్లి తులసమ్మ షాక్ కు గురయ్యారు. తన కొడుకు అక్కడ కనిపించకపోవడం, గది అంతా రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మొదట తెలియలేదు. ఆదివారం రాత్రి తన కొడుకు మహేశ్వర్ రెడ్డితో మద్యం సేవించిన రామచంద్రారెడ్డి కూడా కనిపించకుండా పోయాడు. దీంతో తన కొడుకు హత్య చేయబడ్డాడు అని తులసమ్మ గ్రహించినట్లు సమాచారం. అయితే ఈ హత్యకు తులసమ్మ.. రామచంద్రారెడ్డికి ఏమైనా సహకరించిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే తులసమ్మ, రామచంద్రారెడ్డిలు గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

వివాహేతర సంబంధం కారణంగానే తులసమ్మ కొడుకు మహేశ్వర్ రెడ్డి ఆమెను గత వారం రోజులుగా నిలదీస్తున్నట్లు సమాచారం. తాను కూడా పెళ్లి చేసుకోవాలని.. తమ వివాహేతర సంబంధం వల్ల తనకు పెళ్లి కావడం లేదని చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే క్రమంలో మహేశ్వర్ రెడ్డి.. రామచంద్రారెడ్డితో వారం రోజులుగా తరచూ వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డి‎ని రామచంద్రారెడ్డి కడతేర్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రామచంద్రారెడ్డి.. మహేశ్వర్ రెడ్డికి మూడు లక్షలు బాకీ ఉన్నట్లు కూడా చెబుతున్నారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి భారతి సిమెంట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అయితే రామచంద్రారెడ్డి తన పేరు మీదే స్వీట్స్ దుకాణాన్ని నడుపుతున్నాడు. రామచంద్రారెడ్డి గత 20 ఏళ్లుగా మహేశ్వర్ రెడ్డి తల్లి తులసమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అది నచ్చని మహేశ్వర్ రెడ్డి ఎప్పటినుంచో ఈ విషయం చెబుతున్నా వారు వినిపించుకోలేదు. దీంతో మహేశ్వర్ రెడ్డిపై రామచంద్రారెడ్డి ఈ హత్యకు పాల్పడి ఉంటాడు అనేది స్థానికుల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులు చెబుతున్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలానే పోలీసులు తులసమ్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనలో రామచంద్రారెడ్డితో తులశమ్మ చేతులు కలిపి ఈ హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..