Andhra Pradesh: సోమువీర్రాజు Vs కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ బీజేపీ ముదురుతున్న ముసలం..

ఆంధ్రప్రదేశ్‌ కమలంలో ముసలం ముదురుతోంది. రచ్చ పీక్‌ స్టేజ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. సోమువీర్రాజు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి..

Andhra Pradesh: సోమువీర్రాజు Vs కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ బీజేపీ ముదురుతున్న ముసలం..
Kanna Vs Somu

Updated on: Jan 24, 2023 | 9:49 PM

ఆంధ్రప్రదేశ్‌ కమలంలో ముసలం ముదురుతోంది. రచ్చ పీక్‌ స్టేజ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. సోమువీర్రాజు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే నేతలు రెండుగా విడిపోయారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ప్రత్యేకంగా సమావేశమైన కన్నా వర్గం.. సోము తీరుపై సంచలన ఆరోపణలు చేసింది..మొత్తం 120 మంది నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో.. బీజేపీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు, పెదకూరపాడు ఇంఛార్జ్‌ గంధం కోటేశ్వరరావు ఉన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 26న ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు ఆయన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాకపోవడం కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. తాను వ్యక్తిగత కారణాల వల్లే.. హైదరాబాద్ లో ఉన్నాననీ.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానంటూ సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు . కన్నా పార్టీ మార్పు వార్తలపై ఆచితూచి స్పందించారు పవన్. ఇకపోతే కన్నా వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ లో ఉన్నారనీ అందుకే కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నరని చెబుతున్నారు బీజేపీ నేతలు.

మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజు మధ్య గ్యాప్‌ బాగా పెరిగినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కన్నా వర్గం పార్టీకి గుడ్‌బై చెప్పింది. త్వరలోనే కన్నా కూడా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us