CM Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం…

|

Jan 30, 2023 | 6:07 PM

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్న ప్రత్యేక విమానంతో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే సమస్యను గుర్తించారు పైలెట్.

CM Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం...
Ap Cm Jagan
Follow us on

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. అయితే సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ స్పెషల్ ఫ్లైట్‌ను తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్‌  అయిన విమానం.. 5:27 గంటలకు గన్నవరంలో తిరిగి ల్యాండ్ అయింది.

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్‌ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అందుకోసం ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం జగన్‌ సమావేశమవ్వాల్సి ఉంది. అయితే ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయిన వెంటనే గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్లిపోయారు జగన్. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన బధువారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు తాజా సమాచారం అందుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..