Andhra Pradesh: వాట్ ఏ ఐడియా సార్ జీ..! కరెంట్ బిల్లు భారం తప్పించుకునేందుకు వినూత్న ఫ్లాన్..!

| Edited By: Balaraju Goud

Dec 01, 2024 | 12:01 PM

పర్యావరణంపై అవగాహన పెరిగి, పట్టణాలు నుంచి గ్రామాలు దాకా వాయు కాలుష్యము తగ్గించేందుకు ఎవరికి వాళ్లు విద్యుత్ వాహనాలు వినియోగిస్తున్నారు.

Andhra Pradesh: వాట్ ఏ ఐడియా సార్ జీ..! కరెంట్ బిల్లు భారం తప్పించుకునేందుకు వినూత్న ఫ్లాన్..!
Solar Panels On Building Elevation
Follow us on

భారీ కరెంట్‌ బిల్లుతో గుండె గుభిల్లుమని, జేబుకు చిల్లు పడడంతో ఓ వ్యక్తి బుర్రలో ఓ ఐడియా తళుక్కున మెరిసింది. తన ఆలోచనకు రెక్కలు తొడిగి విద్యుత్ బిల్లల నుంచి తప్పించుకునేందుకు వినూత్న ప్రయోగం చేశాడు. ఇప్పుడు అతను కరెంట్‌ బిల్స్‌ కట్టట్లేదు. గవర్నమెంటే వాళ్లకు డబ్బులు కడుతోంది. ఓ చిన్న ఆలోచన వెలుగులు నింపింది. పర్యావరణానికి ఊతం ఇస్తుంది.

ఇళ్లలో వాడిన తర్వాత కూరగాయాల వ్యర్ధాలు మన ఇంటి పెరటి మొక్కలకు ఎరువుగా మారతాయి. మన ఇంటి గోడలు, శ్లాబ్ సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారి కరెంట్ అవసరాలను తీరుస్తుంటాయి. ఇదంతా జరగాలంటే మనసుతో పాటు దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. అది ఒక్కోసారి డబ్బును అధికంగా ఖర్చు చేసినట్లు అనిపించినా మనశ్శాంతిని ఆత్మసంతృప్తి ని ఇవ్వడం తోపాటు మన పరిసరాలకు మేలు చేస్తుంది.

పర్యావరణంపై అవగాహన పెరిగి, పట్టణాలు నుంచి గ్రామాలు దాకా వాయు కాలుష్యము తగ్గించేందుకు ఎవరికి వాళ్లు విద్యుత్ వాహనాలు వినియోగిస్తున్నారు. గతంలో కేవలం స్టార్ హోటల్స్ ధనికులు ఇళ్ల పై భాగంలో మాత్రమే కనిపించే సౌర ఫలకాలు ప్రస్తుతం చిన్నా, పెద్ద వ్యాపార సంస్ధలు ఇళ్లపైన కనిపిస్తున్నాయి. దీని వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అధికంగా ఉండటంతో ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. బ్యాంకులు ద్వారా రుణాలు, సబ్సిడీ సౌకర్యాలు అందుతుండటంతో ప్రతి ఇళ్లు ఒక శక్తి కేంద్రంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఒక హోటల్ నిర్వహకులు వినియోగించిన సౌర ఫలకాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. బి.లక్ష్మీనారాయణ అనే వ్యాపారి తన హోటల్‌పై భాగంతో పాటు రోడ్డు సైడ్ ఎలివేషన్‌కు సైతం సౌర ఫలకాలు అమర్చారు. రూ.30 లక్షల వ్యయంతో 40 కిలో వాట్లు, ఇంటికి 8 కిలో వాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఫలకాలను అమర్చారు. దీని వల్ల తనకు నెలకు రూ.80వేల వరకు కరెంట్ బిల్లు చెల్లించే భారం తప్పిందంటున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణతోపాటు డబ్బు కూడా ఆదా అవుతోందంటున్నారు లక్ష్మీనారాయణ.

కేవలం ప్రైవేటు వ్యక్తులు మాత్రమే కాదు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు ఆలయ అధికారులు. భక్తుల ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగ పరుస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్‌ సత్ఫలితాలివ్వడంతో అటు అధికారులతోపాటు ఇటు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ బిల్లుల రూపంలో ప్రతి నెల లక్షలాది రూపాయల ఖర్చు తగ్గడంతో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో బొగ్గు కొరత ద్వారా ఏర్పడే పలు రకాల సమస్యలను అధిగమించే అవకాశం ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..