లడ్డూ ప్రసాదంలో టీటీడీ మరో రికార్డ్.. ఊహించని విధంగా అమ్మకాలు..
Samatha
2 January 2026
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం ఇష్టపడని వారు ఉండరు. శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాన్ని భక్తులు మహాభాగ్యంగా భావించి తీసుకుంటారు.
తిరుమల లడ్డూ ప్రసాదం
ఇక తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అమ్మకాల్లో టీటీడీ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం లడ్డూ విక్రయం భారీగా పెరిగింది.
తిరుపతి లడ్డూ రికార్డు
తిరుమల తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదం తీసుకుంటారు. భక్తులకు ఇది చాలా ప్రీతికరమైనది, ఈ లడ్డూ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
భక్తులకు ప్రీతికరమైనది
అయితే 2025లో తిరుమల శ్రీ వారి లడ్డూ విక్రయం విషయంలో టీటీడీ ముందడుగువేసింది. ఈ సంవత్సరం ఏకంగా 13.52 కోట్ల లడ్డూలను విక్రయించి రికార్డ్ క్రియేట్ చేసింది.
13.52 కోట్ల లడ్డూ విక్రయాలు
ఈ సంవత్సరంలో 13.5 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ ప్రకటించింది. 2024ల 12.15 శాతం లడ్డూలను విక్రయించగా, ఈ సంత్సరం 1.37 లడ్డూలను అదనంగా విక్రయించింది.
అదనంగా 1.37 లడ్డూ విక్రయాలు
అంటే 2024 సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం టీటీడీ 10 శాతం అదనంగా లడ్డూ విక్రయాలను చేసింది. దీనికి కారణం లడ్డూ రుచి, నాణ్యతే అంటున్నారు అధికారులు.
10 శాతం అదనంగా..
గత పది ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగిందని,రోజూ దాదాపు 4 లక్షల లడ్డూలను పోటులో తయారు చేస్తున్నట్లు
4 లక్షల లడ్డూల తయారీ
అలాగే రద్దీ సమయాల్లో బఫర్ స్టాక్ గా 8 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు, శ్రీవారి పోటులో నిరంతరాయంగా రెండు షిప్ట్‌ల్లో 700 మందికి పైగా శ్రీవైష్ణవులు లడ్డూ తయారు చేస్తున్నారు.