Andhra Pradesh: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్‌.. మట్టి నమూనాల సేకరణ షురూ.. ఎక్కడంటే..?

అమరావతి మీదుగా వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్ కోసం గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించే పనులు ప్రారంభమయ్యాయి. చేబ్రోలు, వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో పెద్ద పెద్ద యంత్రాలతో 20 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి, ప్రతి ఐదు మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.

Andhra Pradesh: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్‌.. మట్టి నమూనాల సేకరణ షురూ.. ఎక్కడంటే..?
Soil Survey Underway For Hyderabad Chennai Bullet Train

Edited By:

Updated on: Sep 17, 2025 | 10:48 PM

హైదరాబాద్.. చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకూ ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. మొట్ట మొదటి ప్రాజెక్‌గా చేపట్టిన ముంబై – అహ్మదాబాద్ మధ్య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకూ ఈ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో ఉన్న ట్రాక్ పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనకు భిన్నంగా ఎలైన్‌మెంట్ ఉండనుందన్న ప్రచారం జరుగుతోంది.

గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, వట్టి చెరుకూరు, కాకుమాను మండలాల్లో ఇప్పటికే పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇరవై మీటర్ల వరకూ బోర్లు వేసి ప్రతి ఐదు మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలు తీస్తున్నారు. వీటిని చిన్న చిన్న ప్యాకెట్స్‌లో నింపి గుర్‌గ్రామ్‌లోని లేబోరేటరికి పంపిస్తున్నట్లు మట్టి నమూనాలు సేకరిస్తున్న సిబ్బంది చెబుతున్నారు. ఫైనల్ లోకేషన్ సర్ లో భాగంగా ఈ పనులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ నుండి శంషాబాద్, నార్కెడ్ పల్లి, సూర్యాపేట, కోదాడ, అమరావతి రాజధాని, గుంటూరు, చీరాల మీదుగా ఈ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలోని ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకూ అమరావతి రాజధాని రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా భూసేకరణ జరుగుతోంది. అయితే హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ అత్యంత్య వేగంగా వెళ్లే రైళ్లను నడపవచ్చు.

మట్టి నమూనాలు సేకరిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్‌పై చర్చ నడుస్తోంది. ఏ ఏ గ్రామాల నుండి రైల్వే లైన్ వెలుతుంది..? ఎంత భూమి అవసరం అవుతుందోనని స్థానికులు ఇప్పటి నుండే చర్చించుకుంటున్నారు. ఎలైన్‌మెంట్‌పై కూడా గ్రామస్థులు మాట్లాడుకుంటున్న పరిస్తితి కనిపిస్తుంది. అయితే కొత్త మార్ లోని పులు గ్రామాల్లో ఇప్పటివరకూ ఎటువంటి రైల్వే లైన్ లేదు. దీంతో కొత్త ప్రాజెక్ట్ ఇప్పటికే ఉన్న ట్రాక్ పక్క నుండి కాకుండా కొత్త మార్గంలోనే వస్తుందని అందరూ భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..