Andhra Pradesh: ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ బుల్డోజర్ కలకలం రేపింది. అక్కడ అల్లర్ల పేరుతో బుల్డోజర్‌ను ప్రయోగిస్తే, ఇక్కడ ఏకంగా అధికారిపైనే బుల్డోజర్‌ను ఉపయోగించింది మట్టి మాఫియా. అసలు, ఏపీలో ఈ బుల్డోజర్ కథేంటో? ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
బుల్డోజర్, యూపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో వినిపించిన ఈ పదం, ఇప్పడు దేశం మొత్తం రీసౌండ్ వస్తోంది. బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఆనాడు కాషాయ నేతలు ఇచ్చిన వార్నింగ్స్ ఏమోగాని, ఇప్పుడు నిజంగానే బుల్డోజర్స్ కలకలం రేపుతున్నాయ్. బుల్డోజర్లతో ఢిల్లీలో చేపట్టిన కూల్చివేతలు దేశవ్యాప్తంగా సంచలనం రేపితే, సేమ్ టు సేమ్ – అలాంటిదే కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లోనూ బుల్డోజర్ కలకలం రేపింది. ఈ బుల్డోజర్‌ను ఉపయోగించింది కూల్చడానికి కాదు, చంపడానికి?. అది కూడా సాదాసీదా వ్యక్తిని కాదు. ఏకంగా ఓ అధికారిపైనే హత్యాయత్నానికి పాల్పడింది మట్టి మాఫియా.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు విలేజ్‌లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐ అరవింద్‌పై ఎటాక్ చేసింది మాఫియా. ఏకంగా బుల్డోజర్‌తో తొక్కి చంపేందుకు ప్రయత్నించింది. బుల్డోజర్ ఇన్సిడెంట్‌పై ప్రతిపక్ష టీడీపీ సీరియస్‌గా రియాక్టైంది. వైసీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటే బుల్డోజర్‌తో తొక్కి చంపేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. ఆర్‌ఐపై జరిగిన ఎటాక్‌పై మండిపడుతున్నారు రెవెన్యూ ఉద్యోగులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.
Also read:
The Warriorr: అదరగొట్టిన రామ్.. షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్.. మరోసారి మెస్మరైజ్ చేసిన దేవీ శ్రీ
Cross fire with Minister KTR: KTR కు KCR వేసిన మార్కులు ఎన్ని..? రాజకీయ పరంగా..? వారసత్వ పరంగా..?