Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం పరిచయమైన ఓ అమ్మాయి తన మెసేజ్‌లకు రిప్‌లేలు ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నెలల క్రితం పరిచయమైన ఓ అమ్మాయి తన మెసేజ్‌లకు రిప్‌లేలు ఇవ్వడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాదం ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పారాది గ్రామానికి చెందిన చిన్నమ్మ, బోడయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి ఇప్పటికే వివాహం కాగా కుమారుడు పున్నాన శేఖర్ 10th క్లాస్ వరకు చదివి విజయవాడలోని ఓ ఫర్నీచర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఉపాధి కోసమని తల్లిదండ్రులు చెన్నై వెళ్లగా శేఖర్ ఇక్కడే ఉంటున్నాడు.
అయితే గత జూన్ నెలలలో తన సోదరి అయిన లత ఇంట్లో శుభకార్యం ఉండడంతో శేఖర్ అక్కడికి వెళ్లాడు. ఆ పంక్షన్‌లో శేఖర్‌కు ఓ ఆమ్మాయితో పరిచయం ఏర్పడింది. దీంతో ఒకరి సోషల్ మీడియా అకౌంట్‌లు ఒకరు తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు చేసుకునేవారు. అయితే వారం పాటు అక్క ఇంటి దగ్గరే ఉన్న శేఖర్ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో అమ్మాయికి మెసేజ్ చేశాడు. కానీ ఏం జరిగిందో తెలియదు.. సడెన్‌గా శేఖర్ మెసేజ్‌లకు అమ్మాయి రిప్‌లే ఇవ్వడం ఆపేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
రెండు రోజుల పాటు అమ్మాయి నుంచి ఎలాంటి మెసేజ్‌లు రాకపోయే సరికి తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే గురువారం రాత్రి స్నేహితులతో సరదాగా గడిపిన శేఖర్ శుక్రవారం ఉదయం ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన బంధువు తలుపులు బద్దలకొట్టి చూడగా.. శేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అది చూసి షాకైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
