చాణక్య నీతి : ప్రేమలో ఉన్నవారు చేసే అతి పెద్ద తప్పు ఇదే!

Samatha

22 August 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, తత్వవేత్త, తన కాలంలోనే అత్యంత  జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి.

ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

అదే విధంగా చాణక్యుడు ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు ఏంటి? దానికి సంబంధించిన అనేక అంశాల గురించి ఆయన తెలియజేయడం జరిగింది.

ప్రేమలో ఉన్నప్పుడు కొంత మంది వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు గుడ్డిగా నమ్మడం. ప్రేమించడం సరైనదే అయినప్పటికీ ఎప్పుడూ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని చెబుతున్నాడు చాణక్యుడు.

అలాగే చాలా మంది ప్రేమ కోసం తమ గోల్స్, లక్ష్యం, కెరీర్‌ను మర్చిపోతారు. అయితే అలా చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు పండితులు.

అలాగే చాలా మంది ప్రేమ కోసం తమ గోల్స్, లక్ష్యం, కెరీర్‌ను మర్చిపోతారు. అయితే అలా చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు పండితులు.

కొందరు ప్రేమ ఒకే కానీ అతి ప్రేమ అనేక సమస్యలకు దారి తీస్తుంది అందువలన అతి ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు పండితులు.

అలాగే ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, అక్కడ నిజమైన ప్రేమ ఉండదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు. అందుకే ప్రేమలో స్వార్థం ఉండకూడదు.