అమ్మ బాబోయ్.. ఎవరి పనుల్లో వారుంటే ఒక్కసారే దూసుకొచ్చింది.. వీడియో చూస్తే గుండె జల్లుమానాల్సిందే..
విజయనగరం దత్తిరాజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము సృష్టించిన కలకలం తీవ్ర భయాందోళన రేపింది. వార్డులోకి దూసుకొచ్చిన పామును చూసి రోగులు, బంధువులు పరుగులు తీశారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, స్నేక్ క్యాచర్ సహాయంతో పామును సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో ముప్పు తప్పినా, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు.

విజయనగరం జిల్లా దత్తిరాజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. ఉదయం అందరూ ఎవరి పనిలో ఉన్నారు. హాస్పటల్ క్లీనింగ్ స్టాఫ్ కూడా వార్డ్ పరిసరాలను శుభ్రపరుస్తున్నారు. ఆ సమయంలోనే వార్డు సమీపంలోని మూలలో దాగి ఉన్న పాము ఒక్కసారిగా అతివేగంగా దూసుకు వచ్చింది. అలా అకస్మాత్తుగా పాము బయటకు రావడంతో అక్కడున్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొందరు రోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీయగా, చిన్నపిల్లలతో వచ్చిన వారు మరింత భయంతో ఆందోళన చెందారు.
ఈ సంఘటనను గమనించిన హాస్పటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, ఎవరూ పాము దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతను వెంటనే అక్కడికి చేరుకుని పాముకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తగా రెస్క్యూ చేశాడు.. అనంతరం ఆ పామును హాస్పటల్ కు దూరంగా సురక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
వీడియో చూడండి..
ఈ ఘటనలో ఎవరికీ.. ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పిందని అంటున్నారు రోగులు. ఈ ఘటన నేపథ్యంలో హాస్పటల్ పరిసరాలను తరచూ శుభ్రపరచాలని, చెట్ల పొదలు, చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర పాములు, జంతువులు హాస్పటల్ వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
