ఊరి బయట గుడి దగ్గర ఏదో అలికిడి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఖాకీలు..!
పురాతన దేవాలయాలు అంటే అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు. అంతేకాక అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయాల దగ్గర గుప్తనిధుల తవ్వకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే గురువారం (అక్టోబర్ 08) పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనాయన జ్యోతిక్షేత్రంలో నిత్యం పూజలు, నిత్య అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. ఈ జ్యోతి క్షేత్రం అతి పురాతనమైనది అంతేకాక అటవీ ప్రాంతంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయని ఇప్పటికే అనేకసార్లు చాలామంది ఇక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. అలానే పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఈసారి ఆంధ్ర – తెలంగాణకు చెందిన కొంతమంది వ్యక్తులు సాంకేతికత ఉపయోగించి తవ్వకాలకు శ్రీకారం చుట్టారు.
పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ లోని కాశీనాయన జ్యోతి క్షేత్రం సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఏదో అలికిడి జరుగుతుండటంతో అటుగా ఉన్న కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోరుమామిళ్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న టాటా ఏసీ వాహనం, పూజా సామాగ్రి, గుప్తనిధుల తవ్వకాల కోసం జరిపే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ఆరుగురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం ఇదేమి కొత్త కాకపోయినా ఇలా పూజలు చేసి గుప్తనిధులు తీసి కొంతమంది ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే మూఢనమ్మకాలను వీడి ఇలాంటి గుప్త నిధుల తవ్వకాలు జరపటం ఆపితే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..