Singer Mangli: సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ.. అభిమానులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..!

Singer Mangli: సెలెబ్రెటీలు ఈ మధ్య బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కారణం కరోనా కాదు. అభిమానులు. అవును.. ఫ్యాన్స్‌ కారణంగా ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లాలన్నా ఆలోచిస్తున్నారు

Singer Mangli: సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ.. అభిమానులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..!

Updated on: Dec 28, 2021 | 12:04 AM

Singer Mangli: సెలెబ్రెటీలు ఈ మధ్య బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కారణం కరోనా కాదు. అభిమానులు. అవును.. ఫ్యాన్స్‌ కారణంగా ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లాలన్నా ఆలోచిస్తున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా సెల్ఫీలతో విసిగిపోతున్నారు పబ్లిక్‌ ఫిగర్లు. తాజాగా సింగర్ మంగ్లీ ఈ విషయంలోనే తీవ్ర అసహనానికి గురయ్యారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. మంత్రి కుమార్తె పెళ్లి రెసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఒక్కసారిగా ఫోటోల కోసం ఫ్యాన్స్‌ హంగామా చేయడంతో తట్టుకోలేక అటూ ఇటూ పరుగులు పెట్టింది మంగ్లీ.

అక్కడ యువకుల తీరుతో ఇబ్బంది పడింది మంగ్లీ. ఇదేం పద్దతి అంటూ మండిపండింది. ఇలా ఒక్క మంగ్లీనే కాదు, గతంలోనూ చాలామంది సెలెబ్రెటీలు ఇబ్బందులకు గురయ్యారు. షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అభిమానుల నుంచి ఈ సెల్ఫీల తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానానికి కూడా ఓ పద్ధతి ఉంటుందని, కానీ సెల్ఫీల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని గతంలో చాలామంది సెలెబ్రెటీలు కోరారు.

Also read:

Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..