Mysterious Animal Attack: మొన్నటి వరకు వింత రోగాలతో వణికిపోయిన పశ్చిమగోదావరి జిల్లా మరోమారు భయం గుప్పిట్లో బ్రతుకుతోంది. కంటికి కనిపించని శత్రువుతో జిల్లా వాసులు హడలెత్తిపోతున్నారు. మూగజీవాలు వరుసగా మృత్యువాత పడుతుండటం జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో గుర్తుతెలియని జంతువు కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా పశువులు, దూడలపై కనిపించని జంతువు దాడి చేస్తోంది. దాదాపు 20 పశువులపై దాడి చేసింది. వింత జంతువు దాడిలో గాయపడిన కొన్ని పశువులు చనిపోయాయంటూ బాధిత రైతులు వాపోతున్నారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు…మూడు రోజులుగా రాత్రి సమయంలో కర్రలు పట్టుకుని గ్రామంలో తిరుగుతూ…కాపలా కాస్తున్నారు.
కాగా, ఈ విషయంపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి పశువుల మృతికి కారణమైన జంతువు జాడను కనుగొనాలని కోరుతున్నారు. రాత్రి సమయంలో గస్తీ ఉండాల్సి వస్తోందని.. ఆ జంతువు భయంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!
ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!