Fishing: చేపల కోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే షాక్‌

| Edited By: Balu Jajala

Mar 29, 2024 | 9:11 PM

ఎప్పటిలాగే మత్స్యకారులు చేపల కోసం వల విసిరారు. వలను లాగేందుకు ప్రయత్నించడంతో చాలా బరువుగా అనిపించింది. ఎప్పుడూ లేనిది వల ఇంత బరువుగా ఉండటంతో పెద్ద సంఖ్యలు చేపలు పడిఉంటాయని, ఇక తమ పంట పండిందని సంతోషించారు మత్స్యాకారులు.

Fishing: చేపల కోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే షాక్‌
Fishing Net
Follow us on

ఎప్పటిలాగే మత్స్యకారులు చేపల కోసం వల విసిరారు. వలను లాగేందుకు ప్రయత్నించడంతో చాలా బరువుగా అనిపించింది. ఎప్పుడూ లేనిది వల ఇంత బరువుగా ఉండటంతో పెద్ద సంఖ్యలు చేపలు పడిఉంటాయని, ఇక తమ పంట పండిందని సంతోషించారు మత్స్యాకారులు. బరువెక్కిన వలను నీటినుంచి బయటకు లాగేందుకు మరికొంతమంది మత్స్యకారులను తీసుకొచ్చి అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. తీరా వలని విప్పిచూసిన మత్స్యకారులకు గుండె ఘల్లుమంది.

వలలో మొసలి ఉంది. దెబ్బకు ఠారెత్తిన మత్స్యకారులు మరికొంతమందిని తీసుకొచ్చి మొసలిని జాగ్రత్తగా బయటకు తీశారు.. అయితే గాలెం కొక్కెం మొసలి నోట్లో గుచ్చుకోవడంతో అప్పటికే ఆ మొసలి చనిపోయింది. మొసలి చిక్కుకోవడంతో వల దెబ్బతిని మొదిటికే నష్టం జరిగిందని బావురుమంటున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో మత్స్యకారుల వలలో మొసలి చిక్కుకోవడంతో కలకలం రేగింది. వెంటనే వలను విప్పి చూడగా అప్పటికే ఆ మొసలి చనిపోయి కనిపించింది. గుండ్లకమ్మలో పరిసర గ్రామాల మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు.

అందులో భాగంగా కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సందర్భంలో వల బరువుగా ఉండటంతో చేపలు అధికంగా చిక్కాయని ఆనందంగా వలను ఒడ్డుకు చేర్చారు. చేపల వలను విప్పడంతో మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసి భయభ్రాంతులకు గురైన మత్స్యకారులు గుండ్లకమ్మ డ్యామ్ అధికారులకు సమాచారం అందించారు. గతంలో మొసళ్లు కనిపించిన దాఖలాలు లేకపోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.