Nandus World Scam: ఆ పాపులర్ యూట్యూబర్‌కు షాక్‌.. ఉద్యోగాల పేరుతో వసూళ్ల దందా.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..!

Nandus World Scam: యూట్యూబ్‌ ద్వారా ఫేమ్ అయిన అనేకమంది తెలుగు వారిలో రీసెంట్ గా ఎక్కువగా పాపులరైన జంట నందూస్ ఫ్యామిలీనే. నందన, తన భర్త, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుుంది. కొంచెం డిఫరెంట్ హస్కీ వాయిస్..

Nandus World Scam: ఆ పాపులర్ యూట్యూబర్‌కు షాక్‌.. ఉద్యోగాల పేరుతో వసూళ్ల దందా.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..!
Nandus World Scam

Updated on: Jun 04, 2026 | 8:43 AM

Nandus World Scam: యూట్యూబర్, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమానందన దంపతుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్‌ పేరుతో పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమా నందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. యూట్యూబ్‌ ద్వారా ఫేమ్ అయిన అనేకమంది తెలుగు వారిలో రీసెంట్ గా ఎక్కువగా పాపులరైన జంట నందూస్ ఫ్యామిలీనే. నందన, తన భర్త, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుుంది. కొంచెం డిఫరెంట్ హస్కీ వాయిస్ తో ఉండే ఆమె చేసే వీడియోలకు ఎంతో క్రేజ్ ఉంది. ఆమె ఛానల్ కు 28 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కంటెంట్ పరంగా UKలో ఫ్యామిలీ డైలీ లైఫ్, వాళ్ళింట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్, పండుగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల సరదా సంభాషణలు ఇలా ఒకటేంటి వారి జీవితంలో సమస్తం మనకు చూపిస్తారు. అది కూడా చాలా సరదాగా. ఈమధ్య చిరంజీవి మూవీలో కూడా మెరిశారు నందన.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..

ఇలా ఇన్-ఫ్లూయన్సర్ గా సంచలనం సృష్టించిన నందన దంపతులు.. ఇప్పుడు వీసా స్కామ్‌ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఒక్కొక్కరి దగ్గర రూ.20 లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ ఇప్పుడీ దంపతులపై కేసు కూడా నమోదైంది. వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులిచ్చినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూల్ చేసినట్లు, 50 మందికిపైగా బాధితులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే ఐదారు కంపెనీల్లో తన భర్త కన్-సల్టెంట్ అని చెప్పి నందనే వసూళ్లు చేసినట్లు కూడా చెబుతున్నారు. అయితే తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్నిరోజుల కిందటే ఓ వీడియో పోస్ట్ చేసింది నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. అంతేకాదు లండన్‌లో తమ వ్యాపారాలు, తన భర్త నిర్వహించే కన్సల్టెంన్సీ కంపెనీ వ్యవహారాలన్నింటిపై ఇండియాలో ఉన్న తన లాయర్‌ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: RBI Notes: 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?

మరోవైపు మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు ఫైల్ చేశాడు. యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యూవల్ కోసం డబ్బులిచ్చానని, విడతల వారీగా సుమారు 15 లక్షలు ఇచ్చినట్లు కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే లండన్‌లో తప్పుడు పనులు చేసి జాబ్‌లు పోగొట్టుకున్నవాళ్లే తమపై ఫిర్యాదులు చేస్తున్నారన్నది నందన సైడ్ వాదన. మొత్తానికి నందూస్ వరల్డ్ ఫేమ్ నందనపై వీసా స్కామ్ ఆరోపణలు రావడం ఆమె ఫాలోవర్లను ఒక షాక్‌లోకి నెట్టింది. ఏదేమైనా ఇందులో నిజాలు ఏంటో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us