బెజవాడలో ప్రారంభమైన శాకాంబరీ ఉత్సవాలు

|

Jul 14, 2019 | 1:57 PM

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు.  ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి […]

బెజవాడలో ప్రారంభమైన శాకాంబరీ ఉత్సవాలు
Follow us on

విజయవాడ:

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు.  ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు.
అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రసాదం వండిపెట్టి భక్తులకు పంచిపెడతారు. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్‌మిస్‌, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు.