Kadapa Yogi Vemana University: కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.కృష్ణారెడ్డి వర్సిటీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వర్సిటీ వైస్ ఛాన్సిలర్ సూర్య కళావతి వద్దకు ఈ విషయం చేరింది. దీంతో రంగంలోకి దిగిన ఆమె కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రకటన జారీ చేశారు.
లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన దృష్టికి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్య కళావతి తెలిపారు. ఇక ప్రిన్సిపాల్ కృష్ణ రెడ్డి స్థానంలో చంద్రమతి శంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వీసీ ఏడు మంది సభ్యులతో కూడినో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటామని సూర్య కళావతి తెలిపారు.
Ration Home Delivery: రేషన్ పంపిణీ ట్రక్కుల ఉత్తర్వుల్లో మార్పులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..