Andhra Pradesh: వైద్యుల అద్భుత ఘనత.. ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ చెయ్యిని అతికించిన డాక్టర్లు..!

జార్ఖండ్ కు చెందిన యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నిర్మాణ రంగంలోని ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. రోడ్డు నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉన్న యువకుడు చెయ్యి పొరపాటును తారు యంత్రంలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికే చెయ్యి శరీరం నుండి విడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన యువకుడిని తెగిపడిన చేతిని తీసుకుని స్థానికులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh: వైద్యుల అద్భుత ఘనత.. ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ చెయ్యిని అతికించిన డాక్టర్లు..!
Mangalagiri Aiims Doctors Successfully Perform Rare Surgery

Edited By:

Updated on: Mar 10, 2026 | 1:09 PM

జార్ఖండ్ కు చెందిన యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నిర్మాణ రంగంలోని ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. రోడ్డు నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉన్న యువకుడు చెయ్యి పొరపాటును తారు యంత్రంలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికే చెయ్యి శరీరం నుండి విడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన యువకుడిని తెగిపడిన చేతిని తీసుకుని స్థానికులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా రోగిని పరీక్షించిన వైద్యులు ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు. తెగిపడ్డ చేతిని తిరిగి అతికించవచ్చని నిర్ణయించారు. ఈ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయడానికి అనేక విభాగాల వైద్యులు కలిసి పని చేయాల్సి ఉంటుంది.

ముందుగా వైద్యులు యువకుడి చేతికి రక్త ప్రసరణ ఆగిపోకుండా చర్యలు చేపట్టారు. అందుకు అవసరమైన చికిత్సను అందించారు. ఆరు గంటల్లోపు రక్తప్రసరణను పునరుద్దరించారు. డాక్టర్ శాంతకుమార్ శివలింగప్ప ఆధ్వర్యంలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం, లిఖిత రెడ్డి, మనోజ్ నేతృత్వంలోని ఆర్థోపెడిక్ వైద్య బృందంతో పాటు ఇతర వైద్య సిబ్బంది యువకుడికి శస్త్ర చికిత్స చేయడం ప్రారంభించారు. మైక్రో సర్జరీ ద్వారా ముందుగా రక్త నాళాలు పనిచేసేలా చేశారు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ వైద్యులు తెగిపడిని చేతి ఎముకను శరీరానికి అతికించారు. ఇక ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు చేతిపై చర్మాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేశారు. దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించారు. అత్యంత అరుదైన రీప్లాంటేషన్ వైద్య విధానం దేశంలోని కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. రోగిని సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో రేర్ ఆపరేషన్‌ సకాలంలో పూర్తి చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మరికొన్ని రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఢిశ్చార్జ్ చేస్తామన్నారు. అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతా సింగ్ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us