Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీవో జారీ చేశారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపలతో వైసీపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించింది. అయితే, సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర హైకోర్టు సహా, సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ జరువాత.. ఆయన విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ రాష్ట్ర సీఎస్‌ను వెంకటేశ్వరరావు పలుమార్లు కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేసింది. 2022, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావును ఆదేశించింది ప్రభుత్వం.